ELR: జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల రైతాంగానికి పంట రుణాల మంజూరు ఆర్థిక స్థాయిని నిర్ణయించే సమయంలో రైతులను కూడా భాగస్వాములను చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో నిన్న వ్యవసాయ అనుబంధ రంగాల పంట రుణాల నిర్ణయంపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు.