VZM: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన పడాల కళ్యాణ్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. భోగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కళ్యాణ్ కలిసిన ఎమ్మెల్యే.. ఆయన సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ విజయం యువతకు ఆదర్శం కావాలని సూచించారు. అనంతరం ఘనంగా సత్కరించారు.