NRML: ప్రజల ఉపాధిని దెబ్బతిసే కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. బుధవారం భైంసా పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద జీ రాంజీ చట్టప్రతులని దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. MGNREGS పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావడం పేద ప్రజల ఉపాధిని దెబ్బతీయడమేనని విమర్శించారు.