MNCL: హైదరాబాద్లో నిర్వహించే కుమ్మరి కులస్తుల మేధో మదన శిబిరానికి తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు కోడూరి చంద్రయ్య కోరారు. బుధవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులోని బోడుప్పల్లో ఉన్న రాఘవ బంకెట్ హాల్లో డిసెంబర్ 28న కుమ్మరి కులస్తుల మేధో మదన శిబిరాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో కులస్తుల సమస్యలు చర్చిస్తారన్నారు.