MDK: గొర్రెలు, మేకలకు నట్టల నివారణకు మందులు వేయించాలని తూప్రాన్ పశువైద్యాధికారి లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో సర్పంచ్ హరీష్ గౌడ్‌తో కలిసి నట్టల నివారణ శిబిరం ప్రారంభించారు. మేకలు గొర్రెలకు నట్టల నివారణకు మందులు వేయించాలని సూచించారు. గ్రామంలోని 1553 జీవాలకు మందులు వేసినట్లు తెలిపారు.