NGKL: శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని బుధవారం HYD మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.