వనపర్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన శివసేనారెడ్డి ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించి పార్టీ నేతలు ప్రమాణ స్వీకార వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.