SKLM: రణస్థలం మండల కేంద్రంలో ‘విద్యా దీప్తి – సంస్కార స్ఫూర్తి’ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పర్యవేక్షణలో ఇవాళ ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు హైందవ సంప్రదాయం, సనాతన ధర్మం ప్రాముఖ్యతపై ఆయన విశదీకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు.