SDPT: ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల స్వచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం దివ్యాంగుల సంక్షేమ సంఘంలో ఏర్పాటు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ చెల్లించాలన్నారు. లేదంటే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.