KRNL: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రాంతీయ సంచాలకులు పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న అజయ్ బాబును నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, గూడూరు పీహెచ్ సీలో పనిచేస్తున్న మధుసూదన్ ను కడప డెంటల్ కాలేజీకి బదిలీ చేశారు.