ADB: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి జరగాల్సిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఈ తేదీల్లో యూజీసీ నెట్, టీజీ సెట్, టీజీ టెట్ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు.