కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి నారాయణపురంలో కలపాల రాజబాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే సోదరుడు యార్లగడ్డ సతీశ్, టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణీ హాజరయ్యారు. 315 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి, యేసు బోధనలు శాంతి, ప్రేమ, సోదరభావాన్ని చాటుతాయని తెలిపారు.