ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగ నియంత్రణ, సృజనాత్మకత, సహనం వృద్ధి చెందుతాయి. నిద్ర మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. మంచి ఆలోచనలకు, ఆరోగ్యకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 15 నిమిషాలు శ్వాసపై దృష్టి ధ్యానం చేయవచ్చు.