W.G: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తతగ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.