MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద వరి సాగును ప్రారంభించారు.