NLR: ఇందుకూరుపేట మండలం యాగర్ల మలుపు వద్ద సోమవారం అదుపుతప్పి ఒక కారు కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మంగళవారం రాత్రి అదే కాలువ, అదే మలుపు వద్ద వ్యాన్ కాలువలోకి దూసుకెళ్లింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చొరవ చేసుకుని అక్కడ ప్రమాదాలను నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.