MNCL: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు టీఎన్జీవోస్ తోనే సాధ్యమని జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా అగ్రికల్చర్, స్టాటిస్టిక్స్, ప్రణాళిక శాఖల కార్యాలయంలో టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 52 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ నెల 31 లోపు సభ్యత్వం పూర్తి చేయాలని ఆయన సూచించారు.