కాకినాడకు చెందిన బీజేపీ నేత మాలకొండయ్యను పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్గా నియమించారు. దీంతో ఆయన మంగళవారం మంగళగిరిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఎండీకి తన నియామక పత్రాన్ని అందచేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూస్తానన్నారు.