E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.శ్రీ లక్ష్మీ రాజమండ్రిలోని ప్రభుత్వ బాలికల సదనాన్ని మంగళవారం సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికల వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినులతో ఆమె మాట్లాడి వారి బాగోగులు, విద్య, ఆరోగ్యం, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.