బరువు పెరగడం వల్ల ఓ భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు నటి రాధికా ఆప్టే వెల్లడించింది. ‘షూటింగ్‌కు ఇంకా టైం ఉందని విహారయాత్రకు వెళ్లొచ్చేసరికి 4 కేజీల బరువు పెరిగాను. ఫొటో షూట్లో లావుగా కనిపించడంతో నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు’ అని ఆమె తెలిపింది. తన తాజా చిత్రం ‘సాలీ మొహబ్బత్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.