MNCL: జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో సోమవారం అత్యవసర పరిస్థితులలో తీసుకుంటున్న చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జీఎం నరసింహారావు, కమాండెంట్ చంచల్ సర్కార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.