ASF: ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత పాల్గొని మాట్లాడారు. శిక్షణలో భోజనం, గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు.