MBNR: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేరును తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగాయి.