KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈనెల 27న మెగా ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27న ఉదయం 9 గంటలకు వర్సిటీ ఆవరణలో జాబ్ మేళా ప్రారంభం కానుందన్నారు. ఇందులో 50కిపైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.