W.G: నరసాపురం(M) ఎల్బీ చర్ల పీహెచ్సీ పరిధిలో ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ఎం. మాధురి తెలిపారు. 13 గ్రామాల్లోని 4,323 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు 32 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 134 మంది సిబ్బందిని నియమించి, 5,000 డోసులను అందుబాటులో ఉంచామన్నారు.