WNP: వింగ్ క్రికెట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 6కు సంబంధించిన జెర్సీ లాంచింగ్, ట్రోపీ లాంచింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతల ట్రోపీని ఘనంగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.