నంద్యాలలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాల్లో శనివారం జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. శ్రావణ లక్ష్మి సీడ్స్ కంపెనీలో స్టాక్ రిజిస్టర్లు, పత్రాలను పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని సూచించారు.