SKLM: పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు శిరీష రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఇవాళ ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రికి వివరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.