మెదక్‌లో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో నిజాంపేట మండలం చల్మెడకి చెందిన సంగెపు గణేష్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన యువకుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం గణేష్‌ను గ్రామస్థులు ఘనంగా అభినందించారు.