సినిమా టికెట్ ధరల పెంపుపై ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టికెట్ ధరలను పెంచడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని చిన్న చిత్రాలు, ధరలు పెంచకుండానే మంచి విజయాలను అందుకున్నాయి. అదే బాటలో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా రాబోతోంది. టికెట్ ధరల పెంపు లేకుండానే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపాడు.