TPT: శ్రీకాళహస్తి (M) ఇనగలూరులోని ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి గురవయ్య డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 433/2లో 2.30 ఎకరాలు పోలమ్మ పేరున ఉన్న భూమిని స్థానికేతరులకు పట్టాలు చేశారన్నారు. కలెక్టర్ విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. 433/1లో 2.55 ఎకరాలు స్థానికేతరుల అక్రమణలో ఉందని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.