ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రతాప్ శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జాబ్ చేయాలంటే ఎక్కడైనా చేయవచ్చునని, పోలీస్ అంటే సేవ చేయడానికి మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఏ విపత్తు వచ్చిన ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిదీ ఛాలెంజ్ తీసుకొని విజయం సాధించాలని ఆకాంక్షించారు.