MBNR: క్రీడా స్ఫూర్తిని నిరంతరం కొనసాగిద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్టేడియం మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడించారు.