ప్రస్తుత రోజుల్లో సరైన జీవిత భాగస్వామి (Spouse) కుదరడం, పెళ్లి జరగడం చాలా కష్టమైపోతోంది. పెళ్లిళ్ల పేరయ్యలు, అత్యాధునిక సదుపాయాలతో కూడిన మేట్రిమోనీ (Matrimony) సంస్థలు అందిస్తున్న సేవలు సరిపోవడం లేదు. అందుకే రాజస్థాన్(Rajasthan)లో 40 ఏళ్ల వ్యక్తి తగిన వధువు (Vadhuvu) కోసం సర్కాన్ని ఆశ్రయించారు. అందరి దృష్టినీ ఆకర్షించే ఈ సంఘటన దౌసా(Dausa) లో చోటుచేసుకుంది. కైలాశ్ వురపు కల్లు మహావర్ (40) దౌసాలోని ప్రభుత్వ రిలీఫ్ క్యాంప్‌నకు వెళ్లారు. తనకు తగిన భార్య కావాలని, వెతికిపెట్టాలని దరఖాస్తు చేశారు. యువతి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కురాలై ఉండాలని, నాజూకైన శరీరంతో స్లిమ్‌గా ఉండాలని తెలిపారు. ఇటువంటి లక్షణాలుగల యువతి దొరికితే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. క్రింది స్థాయి అధికారులు ఆయన దరఖాస్తును స్వీకరించారు. కానీ ఎమ్మార్వో (MRO) ఆ దరఖాస్తును తిరస్కరించారు. పట్వారీ బాబూలాల్ గుర్జర్ స్పందించారు.
ఆయనకు తగిన వధువును అన్వేషించేందుకు పంచాయతీ కార్యదర్శి, పట్వారీ, సర్పంచ్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని క్యాంప్ ఇన్‌ఛార్జి (తహశీల్దారు) హరికిషన్ సైనీ(Harikishan Saini)కి సూచించారు.ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సోమవారం ఉదయం కల్లు ఇంటికి చాలా మంది తరలి వెళ్లారు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అందుకే దరఖాస్తు చేశానని కల్లు వారికి తెలిపారు. తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని, తాను నాలుగోవాడినని చెప్పారు. తన అక్కకు, అన్నదమ్ములకు పెళ్లిళ్లు జరిగాయని అన్నారు. తాను తన తమ్ముడితో కలిసి ఉంటున్నానని చెప్పారు. మార్కెట్, గ్రామ పంచాయతీ(Gram Panchayat)లోని దుకాణాలను శుభ్రం చేస్తూ జీవనోపాధి పొందుతున్నానని చెప్పారు.తహశీల్దారు హరికిషన్ సైనీ మాట్లాడుతూ, ఇటువంటి విషయాల్లో కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. పట్వారీ, దరఖాస్తుదారు స్టేట్మెంట్లను నమోదు చేశామని, దరఖాస్తును తిరస్కరించామని తెలిపారు