ప్రకాశం: గిద్దలూరు మండలం, ముండ్లపాడులో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. క్రీడా ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే క్రీడాకారులకు తెలియజేశారు.