సత్యసాయి: పరిగి మండలంలోని ఊటుకూరు సమీపాన జాతీయ రహదారి బ్రిడ్జిపై ప్రమాదకరమైన రంధ్రం ఏర్పడింది. రహదారి నిర్మించిన నాలుగేళ్లకే బ్రిడ్జిపై రంధ్రం ఏర్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వాహనాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని శనివారం వాహనదారులు కోరుతున్నారు.