VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మారికవలసలోని ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల, పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్య పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.