KMM: కల్లూరు మండలం చుండ్రుపట్లలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. గ్రామానికి చెందిన జోనబోయిన కృష్ణయ్యకు చెందిన గొర్రెల మందపై శనివారం విధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 11 గొర్రెలు మృతి చెందగా, మరో 8 గొర్రెలకు గాయాలయ్యాయి. గొర్రెల మృతితో తనకి భారీగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరారు.