AP: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ప్రభుత్వ ITIలో సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. అటు మంత్రి DVB స్వామి ప్రకాశం పొన్నలూరు సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రూ.65 లక్షల విలువైన రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు.