KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి అంగన్వాడీల సమస్యలు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యత, కొత్త సెంటర్ల అవసరాలపై టీచర్లతో శుక్రవారం ప్రత్యక్షంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.