TG: సికింద్రాబాద్ నియోజకవర్గం జీరాలోని గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫర్నిచర్ పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా మౌలాలి RPF ట్రైనింగ్ సెంటర్లో జరిగే 26వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటేషన్-2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేస్తారు.