SRPT: సైబర్ నేరగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ ఉచ్చు నుంచి విశ్రాంత ఉపాధ్యాయుడు దేవేందర్ రెడ్డిని పోలీసులు కాపాడారు. బెంగళూరులో అసాంఘిక పనులు చేస్తున్నావంటూ బెదిరించి, రూ.18 లక్షలు జమ చేయాలని కేటుగాళ్లు కోరారు. భయంతో బ్యాంకుకు వెళ్లిన బాధితుడిని గమనించిన మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు సకాలంలో స్పందించి నగదు బదిలీ కాకుండా కాపాడారు.