ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఓ చేదు వార్త. ఇకపై పోస్టులకు ఇష్టమొచ్చినన్ని హ్యాష్‌ట్యాగ్‌లు వాడలేరు. పోస్ట్ లేదా రీల్‌కు గరిష్ఠంగా 5 హ్యాష్‌ట్యాగ్‌లు యాడ్ చేయాలనే కొత్త రూల్‌ను త్వరలో తేనుంది. ఇప్పటివరకు 30 వరకు వాడుకునే అవకాశం ఉండగా.. దానికి మెటా చెక్ పెట్టింది. స్పామ్‌ను తగ్గించి, కంటెంట్ క్వాలిటీ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.