GNTR: మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తెనాలి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు శుక్రవారం టీడీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ జగన్ విష ప్రచారం చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.