AP: టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అని పేర్కొంది. భక్తుల కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలని, అధికారుల పర్యవేక్షణ, రికార్డుల భద్రతకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.