E.G: తాళ్లపూడిలోని అన్నదేవరపేట జడ్పీ హైస్కూల్లో సన్ సాద్ ఖేల్-25 క్రీడా పోటీలను మండల తహశీల్దార్ లక్ష్మీ లావణ్య, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి గురువారం ప్రారంభించారు. విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంత దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.