ATP: బెంగళూరు-హైదరాబాద్ మధ్య బుల్లెట్ (హైస్పీడ్ రైలు) రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైలు మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళుతుంది. అందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మట్టి పరీక్షలు నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలంలోని దేవరకొండ, సిద్దరాంపురం పరిసర ప్రాంతాల్లో నిపుణుల బృందం భూ పరీక్షలు నిర్వహించింది.