KNR: జమ్మికుంట మండలం సైదాబాద్ సర్పంచ్ పుప్పాల రాజారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. 20 ఏళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతున్న ఆయన కుటుంబం గ్రామ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చేరికతో సైదాబాద్‌లో బీజేపీ బలం మరింత పెరిగిందని పార్టీ నాయకులు తెలిపారు.