MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం దేవరకద్ర జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. చక్కగా చదువుకుని మంచి స్థానానికి రావాలని సూచించారు. అలాగే భోజనం ఎలా పెడుతున్నారని అడిగి వివరాలను తెలుసుకున్నారు.