NGKL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలోని గది నంబర్ 102లో కంటి శిబిరం నిర్వహించబడనుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.